సంజీవరాయ పర్వతం – ఒకఅద్వితీయ ఆధ్యాత్మిక స్థలం

తిరుమల శ్రీవారి సప్తగిరులకు దక్షిణంగా, కూతవేటు దూరంలో సంజీవరాయ పర్వతం కింది భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభువుగా యోగాసనంలో, చతుర్భుజాలతో, సూర్యచంద్రుల సాక్షిగా త్రేతాయుగంలో వెలిసిన మహిమగల క్షేత్రం . ఇది దేశంలో మరెక్కడా కనబడని రూపం.. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. తిరుమలలో అంజనీ దేవి తపస్సు ఫలంగా జన్మించిన ఆంజనేయ స్వామి, తిరుపతికి సమీపంలో ఉన్న రామచంద్రపురం మండలం, రాయల చెరువు కట్ట దిగుభాగంలోని అడవిలో బాల్యంలో ఆటలాఆడిన ప్రాంతమే ఈ సంజీవరాయ పర్వతం. అందుకే ఈ ప్రాంతాన్ని సంజీవరాయపురంగా పిలవడం ప్రారంభమైంది. యుద్ధకాలంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణం తో మూర్ఛిల్ల గా, హనుమంతుడు సంజీవని తీసుకురావడం కోసం సంజీవ పర్వతాన్ని మోసు కొస్తూ ఈ ప్రాంతంలో ఒక పాదం మోపినప్పుడు కొండ రెండు భాగాలుగా చీలి, రెండుగా ఏర్పడింది. గుండు రెండుగా చీలిపోయి ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తోంది. రామవతారం సమాప్తి తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి తపస్సు చేశారు అనడానికి అనేక సాక్షాలు ఉన్నాయి .
ఈ పర్వతాన్ని పరిశీలిస్తే స్పష్టంగా ఒక వైపు ఏనుగు దంతాలు కుంభస్థలం చెవి ఆకారం కనిపిస్తుంది. చెవి ఆకారం గుర్తులు ఓంకారం ఉంది ఇంకా పరిశీలిస్తే తిరుమల శిఖరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకారం కనిపించినట్టే ఈ గుండులో శ్రీ ఆంజనేయ స్వామి ఆకారం ఉంది స్వామి ఇక్కడ తపస్సు చేసే సమయంలో ఎదురుగా ఉన్న పుష్కరణలో స్నానం ఆచరించడంతో నాలుగు అడుగుల లోతు మాత్రమే ఉన్న ఎన్నో యుగాలుగా నీరు పుష్కరిణిలో నీరు ఎప్పటికీ ఎండకుండా ప్రవహించడం విశేషం.

శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆంజనేయస్వామి వెలుగులోకి వచ్చారని పూర్వీకుల నుంచి ఒక కథనం ప్రచారంలో ఉంది. రాయలవారు రాయల చెరువును రెండు అడవుల మధ్య కట్టను కట్టి చెరువును తవ్వేందుకు పూనుకున్నారు ఎన్నాళ్ళైనా కట్టనిలబడలేదంట ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నంలో చెరువు కట్ట కింద భాగంలో గుండుకు స్వయంభుగా ఉన్న ఆంజనేయ స్వామి కనిపించారట,,, గుండుకు ఉన్న ముళ్లపదులు తొలగించి చూడగా నాలుగు చతుర్భుజాలు యోగాసనంతో సూర్యచంద్రులతో స్వామివారి దర్శనం ఇవ్వడంతో అప్పుడు అక్కడ పూజలు నిర్వహించగా రాయల్ చెరువు కట్ట నిలబడిందని ఓ కథనం.
మరో కథనం కూడా పూర్వీకులు చెబుతున్నారు చెరువు కట్ట నిలబడకపోవడంతో రాయలవారు చెల్లెలు రాయలమ్మను కట్టకు బలి ఇవ్వడంతో కట్టనిలబడిందని చెప్పడమే కాక ఎన్నో ఏళ్ల పాటు చెరువు కట్టపై రాయలమ్మ విగ్రహం మాట్లాడేదని చెప్పేవారు .. ఎవరైనా పెళ్లి పేరంటాలకు పోవాలనిపిస్తే రాయలమ్మ ని అడిగి ఆమె విగ్రహానికి ఉన్న నగలను తీసుకొని మరల తిరిగి ఇచ్చేవారట. చాలా ఏళ్లపాటు జరిగిందని చెబుతున్నారు ఒక దురాశ పరురాలు రాయలమ్మను నగలు అడిగి తీసుకొని తిరిగి ఇచ్చే సమయంలో నీ నోరు పడిపోను అని శాపనార్ధాలు పెట్టిందట ఆ తర్వాత రాయలమ్మ మాటలే మాట్లాడలేదని పూర్వికులు ఇప్పటికీ కథలు కథలుగా గా చెబుతుంటారు.

ఇటీవల 2021 వరదల సమయంలో రాయల్ చెరువు కట్ట పొంగి కట్ట తెగిందని ప్రచారంతో 50 గ్రాముల ప్రజలు 20 రోజులపాటు ఇల్లు వదిలి పారిపోయారు,దీని తరువాత AFCON సంస్థ రాయలసీరువు కట్టపై గుడి కట్టి రాయిలమ్మను ప్రతిష్టించడం జరిగింది. రాయల్ చెరువును నిర్మిస్తూనే రాయలవారు ఆంజనేయస్వామి లక్ష్మీనరసింహస్వామి వారికి చిన్న చిన్న ఆలయాలు నిర్మించారు తదానంతరం కొందరు భక్తులు శ్రీ భవాని అమ్మవారు జలకన్టేశ్వర స్వామి వారిని ప్రతిష్టించి కొన్ని ఏళ్లు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.. 2007 తర్వాత ఇదే ఆలయాన్ని గంగిరెడ్డి పల్లెకు చెందిన ఒక భక్తుడు ఆలయాన్ని విస్తరించి విజయ గణపతి, మహాలక్ష్మి, లక్ష్మీనారాయణ, దక్షిణామూర్తి స్వామి వారితో పాటు బాలసుబ్రమణ్య స్వామి వార్లను వేరు వేరు గర్భాలయాల్లో ప్రతిష్టించారు. 2010 జనవరి 31వ తేదీన ఆ భక్తుడు తీవ్ర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి శివ సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే గర్బాలయంలో కోటి లింగేశ్వర స్వామి తో పాటు 108 శివలింగాలను కొందరు భక్తుల సహకారంతో నిర్మించారు. మరో గర్భాలయంలో కామాక్షి అమ్మవారిని ప్రతిష్టాపించి నిత్యం దేవతల ప్రీతి కోసం యాగశాలను నిర్మించి వివిధ హోమాలను నిర్వహిస్తూ ఉన్నారు శివరాత్రి కార్తీక దీపం , ఉగాది రోజున వినాయక చవితి హనుమాన్ జయంతి లాంటి పర్వదినాల్లో విశేష పూజలు హోమం అన్నదానం లాంటివి నిర్వహిస్తున్నారు. ఇది శివకేశవ క్షేత్రం.. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి భక్తులు కోరిన కోరికలు నెరవేరతుండటంతో తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు.

1 thought on “సంజీవరాయ పర్వతం – ఒకఅద్వితీయ ఆధ్యాత్మిక స్థలం”

Leave a Reply to A WordPress Commenter Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top